Sunday, February 12, 2017

ఎక్సైజ్ శాఖలో గ్రేడ్ 2 పోస్టుల‌ భర్తీకి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్

TSPSC EXCISE DEPARTMENT JOBS

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా 79 గ్రేడ్ 2 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ చేసెందుకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఫైనాన్షియల్ డిపార్ట్ మెంట్స్ క్లియ‌రెన్స్ ఇచ్చిన అనంత‌రం ఈ ఖాళీల‌ భ‌ర్తీకి  ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. డిపార్ట్ మెంట్ లో మ్యాన్ పవర్ తక్కువ ఉందని.. పోస్టుల భర్తీకి అనుమతించాలంటూ టీఎ్‌సబీసీఎల్‌ ఎండీ ప్రభుత్వానికి నివేదించారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం భర్తీకి ఆమోదం తెలిపింది.
ఎక్సైజ్ శాఖ పరిధిలోని తెలంగాణ స్టేట్ బావ‌రేజెస్ కార్పోరేష‌న్ లిమిటెడ్ లో 78 గ్రేడ్ 2 ఆఫీస‌ర్, ఒక స్టెనోగ్రాఫ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసెందుకు ప్ర‌భుత్వం నిన్న జీవో జారీ చేసింది. గ్రేడ్ 2 పోస్టుల్లో అసిస్టెంట్ అకౌంటు ఆఫీస‌ర్ 13, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీస‌ర్ 56, డాటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ 1 పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. స్థానికత‌, రోస్టర్ విధానం ద్వారా ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు తెలంగాణ ఆర్థిక శాఖ సెక్ర‌ట‌రీ శివ శంక‌ర్ ఒక ప్ర‌క‌ట‌న‌ను జారీ చేశారు.

No comments:

Post a Comment